వారితో మాత్రం జ్యోతి మల్హోత్రాకు ఎలాంటి సంబంధం లేదు: పోలీసులు

జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది.

Update: 2025-05-22 09:04 GMT

భారతదేశానికి చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్‌ చాటింగ్‌ను గుర్తించారు.


ఆ చాటింగ్‌లో తనను పెళ్లి చేసుకోవాలని జ్యోతి మల్హోత్రా అలీ హసన్‌ ను కోరింది. పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం జ్యోతి షేర్‌ చేసింది. కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో కూడా ఉన్నాయి. జ్యోతి మల్హోత్రాకు నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్‌ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో తేలింది.


Tags:    

Similar News