పోలీసులు వ్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలి

పోలీసు వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు

Update: 2022-04-01 13:47 GMT

పోలీసు వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. అధికార ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. అనవసరమైన ఒత్తిళ్లు వ్యవస్థలను బలహీనపరుస్తాయని చెప్పారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. పోలీసులు నేరాల నిరోధానికి నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. సీబీఐ పై ప్రారంభ దశలో ప్రజల్లో నమ్మకం ఉండేదన్నారు. సీబీఐ స్వతంత్రంగా పనిచేస్తేనే నేరాల అదుపు సాధ్మమవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

పోలీసుల పనితీరు...
సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కొహ్లి 19వ స్మారకోపన్యాసం సభలో ఆయన ప్రసంగించారు. చట్టాన్ని సమానంగా అందరికి అమలు చేయాలని కోరారు. సమాజంలో అప్పుడే శాంతిభద్రతలు వెల్లివిరుస్తాయని చెప్పారుే. ప్రజలను సమన్వయం చేసుకుుంటూ పనిచేయాలని సూచించారు. అవినీతి ఆరోపణలతో పోలీసు వ్యవస్థ పనితీరు మసక బారుతుందని జస్టిస్ రమణ ఆవేదన చెందారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం పోలీసులకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News