పారా మిలిటరి బలగాలకు సెలవులు రద్దు
భారత ప్రభుత్వం పారా మిలిటరి బలగాలకు సెలవులు రద్దు చేసింది
భారత ప్రభుత్వం పారా మిలిటరి బలగాలకు సెలవులు రద్దు చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలనిఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు శ్రీనగర్ విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది
దాడి తర్వత...
ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం అప్రమత్తం అయి పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసింది. అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంది. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు. శ్రీనగర్‌లో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం పహల్గామ్‌కు ఆర్మీచీఫ్ ద్వివేది వెళ్లారు.