గుడ్ న్యూస్ - దేశంలో 10 వేల దిగువకు రోజువారీ కేసులు

ఇదే సమయంలో 16,765 మంది కరోనా నుంచి కోలుకోగా.. 119 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య..

Update: 2022-02-28 04:47 GMT

న్యూ ఢిల్లీ : భారత్ లో రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేయగా.. రోజువారీ కేసులు 10 వేల దిగువకు చేరాయి. దేశంలో నిన్న 8,013 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 16,765 మంది కరోనా నుంచి కోలుకోగా.. 119 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 5,13,843కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,02,601 యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారిలో 4,23,07,686 మంది కోలుకున్నారు. భారత్ లో ఇప్పటి వరకూ 177,50,86,335 డోసుల‌ వ్యాక్సిన్లు వినియోగించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.


Tags:    

Similar News