ఇండియాలో మరింత తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను..

Update: 2022-03-19 06:31 GMT

న్యూ ఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,075 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,383 మంది కరోనా నుంచి కోలుగా.. 71 మంది కరోనాతో మృతి చెందారు.

యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 27,802గా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పడిపోయింది. ఇప్పటివరకూ దేశంలో 4,24,61,926 మంది కరోనా నుంచి కోలుకోగా.. కరోనా బారిన పడి 5,16,352 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది.



Tags:    

Similar News