Delhi : ఢిల్లీలో రెడ్ అలెర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో నేడు కూడా కుండపోత వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-08-09 03:55 GMT

దేశ రాజధాని ఢిల్లీలో నేడు కూడా కుండపోత వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్నటి నుంచి ఢిల్లీని వర్షం ముంచెత్తింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారుల్లో అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. రహదారుల్లో నీరు నిండిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.

భారీ వర్షంతో...
నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమమయమయ్యాయి. అధికారులు అప్రమత్తమయి లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేశారు. ఈరోజు కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండటం మంచిదన్న హెచ్చరికలను అధికారుల చేశారు.


Tags:    

Similar News