భారీ వర్షాలు.. మూడు రోజులు స్కూళ్లకు సెలవులు
పంజాబ్ కు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
పంజాబ్ కు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గతంలో ఎన్నడూ లేన విధంగా పంజాబ్ లో వర్షం నమోదవుతుందని తెలిపింది. గత ఇరవై ఐదేళ్ల నుంచి నమోదు కాని వర్షపాతం ఇటీవల కాలంలో పంజాబ్ లో అత్యధికంగా వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నదులు ఉప్పొంగుతుండటంతో...
ఇప్పటికే పంజాబ్ లోని సట్లజ్, వియాస్, రవి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. దాదాపు వెయ్యి గ్రామాలు నీటిలో నానుతున్నాయని, 61 వేల హెక్టార్లలో వ్యవసాయ భూములు మునిగిపోయి దెబ్బతిన్నాయని అంచనా వేశార. దీంతో పంజాబ్ లో ఈ నెల 3వ తేదీ వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.