నేడు పథ్నాలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
నేడు పథ్నాలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది.
నేడు పథ్నాలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. నేడు పథ్నాలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, అసోం, మేఘాలయ, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రభుత్వాలను అప్రమత్తం...
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ రాష్ట్రాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలయినంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సూచించింది. కొండచరియలు కూడా విరిగిపడే అవకాశముందని తెలిపింది.