ఆలయాల ఎత్తు పెంచేస్తూ.. సరికొత్త శోభను తీసుకొస్తూ!!
తమిళనాడులో ఆలయాల ఎత్తును పెంచుతున్నారు.
తమిళనాడులో ఆలయాల ఎత్తును పెంచుతున్నారు. గుడులు లోతట్టుగా మారిపోవడంతో వర్షాకాలంలో ముంపు సమస్య నుంచి బయటపడడానికి పలు ఆలయ కమిటీలు హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ అనుమతి తీసుకుని ఆలయాల ఎత్తు పెంచాయి. పునాదిపైన, గోడ మధ్యలో బెల్ట్ తరహాలో పటుత్వం వచ్చేలా రెండంచెల బెల్ట్‌బీమ్ కాంక్రీట్ సాంకేతికతను వాడుతున్నారు. ఈ పనులను మామ్‌చంద్ హౌస్‌లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతోంది.
బెల్ట్ బీమ్ సాంకేతిక విధానాన్ని వాడి, పునాదుల మీద జాకీల్ని అమర్చి, ఆలయాల్ని ఒక్కో అడుగు చొప్పున పైకి ఎత్తుతూ నిర్మాణాలు చేపడుతున్నామని మామ్‌చంద్ హౌస్‌లిఫ్టింగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. చెంగల్పట్టు సింగపెరుమాల్ కోయిల్‌లో 1500 ఏళ్ల క్రితం పల్లవరాజులు నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏకంగా ఈ సంస్థ ఆరు అడుగుల మేర పైకి తీసుకొచ్చింది.