భారత్ లో ఈరోజు ఎన్ని కేసులంటే?

గడిచిన 24 గంటల్లో దేశంలో 7,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Update: 2023-04-18 06:20 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గాయి. నిన్న మొన్నటి వరకూ పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే రెండు రోజుల నుంచి కొంచెం కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

తగ్గినప్పటికీ....
ఇక భారత్ లో ప్రస్తుతం 61,223 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. నిన్నటి వరకూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికంగా నమోదయ్యేవి. అయితే తాజాగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News