గుడ్ న్యూస్...మావోయిస్టులతో పోరాడిన పోలీసులకు గుడ్ న్యూస్.. డీఎస్పీలుగా ప్రమోషన్
హోం శాఖ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది. మావోయిస్టులతో పోరాడి విజయం సాధించిన పోలీసులకు పదోన్నతులను కల్పించింది
హోం శాఖ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది. మావోయిస్టులతో పోరాడి విజయం సాధించిన పోలీసులకు పదోన్నతులను కల్పించింది. అవుట్ ఆఫ్ వేగా ఈ పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ ఏరియాలో మావోయిస్టులను పెద్ద సంఖ్యలో భద్రతాదళాలతో పాటు పోలీసులు కూడా పాల్గొన్నారు.
రెండు వందల యాభై మందికి...
దాదాపు రెండు వందల యాభై మందికి రిజర్వేషన్లతో పాటు పదోన్నతులు కల్పించింది. డిఎస్పీ హోదా కల్పిస్తూ వారికి ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు నెలల కాలంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించిన హోం శాఖ దాదాపు మూడు వందల మందికి పైగా హతమార్చింది. సమాచారాన్ని సేకరించడంలో లోకల్ పోలీసులు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.