తప్పించుకున్న ఖలిస్థానీ లీడర్

పంజాబ్ లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు.

Update: 2023-03-19 06:20 GMT

పంజాబ్ లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. పోలీసులు వంద వాహనాలలో ఛేజ్ చేసినా ఫలితం లేదు. అమృత్ పాల్ సింగ్ అనుచరులను 78 మందిని అరెస్ట్ చేయడంలో మాత్రం పోలీసులు కొంత సక్సెస్ అయ్యారు. అమృత్‌పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారని పంజాబ్ పోలీసులు ప్రకటించారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రత్యేక దేశం అంటూ...
గత కొంతకాలంగా పంజాబ్ ను ప్రత్యేక దేశం చేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విదేశాల్లోనూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఆగబోదని, పంజాబ్ ను దేశంగా ప్రకటించాల్సిందేనని అమృత్‌పాల్ సింగ్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా తృటిలో తప్పించుకున్నాడు. ద్విచక్ర వాహనంపై వెళ్లడం తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. అమృత్‌పాల్ సింగ్ తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News