1971లో వీరమరణం.. 54 ఏళ్ల తర్వాత లభించిన సత్కారం
1971లో వీరమరణం చెందిన ఓ సైనికుడికి 54 ఏళ్ల తర్వాత సత్కారం దక్కింది.
1971లో వీరమరణం చెందిన ఓ సైనికుడికి 54 ఏళ్ల తర్వాత సత్కారం దక్కింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధంలో భిండ్‌కు చెందిన రామ్‌లఖన్ గోయల్ వీరమరణం పొందారు. ఇటీవల ఒక సైనిక వాహనం భిండ్ నగరంలోని సైనిక్ కాలనీకి వచ్చి ఆగింది. స్థానికురాలైన లీలాదేవిని అమరుడైన రామ్‌లఖన్ భార్యగా నిర్ధారించుకున్నారు. సైనికులు గోయల్‌కు చెందిన ఒక పెట్టె, వస్తువులను లీలాదేవికి ఇచ్చారు. వాటిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గార్డ్ ఆఫ్ ఆనర్ షీల్డు, ఒక లేఖ ఉన్నాయి. లేఖను 2018 నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ సంయుక్తంగా పంపారు. ఆయన్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం సత్కరిస్తున్నట్లు లేఖలో ఉంది. పెళ్లయిన కొత్తలోనే భర్తను కోల్పోయింది లీలా దేవి. పిల్లలు లేకపోవడంతో మేనల్లుడిని దత్తత తీసుకుని పెంచుకుంటూ ఉన్నారు. రామ్‌లఖన్ చేసిన త్యాగం ఇప్పటికీ బంగ్లాదేశ్ మరచిపోకపోవడం విశేషం.