ఉత్తర సిక్కింలో భారీగా మంచు

ఉత్తర సిక్కింలో భారీగా మంచు కురుస్తుంది

Update: 2026-04-07 03:55 GMT

ఉత్తర సిక్కింలో భారీగా మంచు కురుస్తుంది. లాచెన్‌లో మంచులో 1200 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. ఉత్తర భారతంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.

పర్యాటకుల ఇబ్బందులు...
మరొకవైపు మంచును ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. నిన్న జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారి మధ్య కొండచరియలు విరిగిపడి వాహనాలు చాలా సేపు నిలిచపోయాయి. అలాగే ఉత్తర సిక్కింలోని లాచెన్‌-శివమందిర్‌ మార్గంలో భారీగా మంచు పేరుకుపోయింది. ప్రతికూల వాతావరణంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు.


Tags:    

Similar News