విడాకుల వేడుక.. వెరైటీగా

విడాకుల సందర్భాన్ని కూడా అంత వేడుకగా నిర్వహిస్తున్నారు

Update: 2026-04-06 05:36 GMT

ప్రస్తుతం వివాహాలు ఎంత ఆర్భాటంగా చేసుకుంటున్నారో.. విడాకుల సందర్భాన్ని కూడా అంత వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ లో విశ్రాంత న్యాయమూర్తి జ్ఞానేంద్ర కుమార్ తన కుమార్తె విడాకుల సందర్భాన్ని వేడుకగా నిర్వహించుకోవడం సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. జ్ఞానేంద్ర కుమార్ కుమార్తె ప్రణీతకు 2018లో ఒక ఆర్మీ మేజర్ తో వివాహమయింది. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.

విడాకులు మంజూరయిన తర్వాత...
దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని భావించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మేరఠ్ లోని ఫ్యామిలీ కోర్టు దంపతులు ఇద్దరికీ విడాకులను మంజూరు చేసింది. అయితే విడాకులు మంజూరయిన తర్వాత తన కుమార్తె న్యాయస్థానం నుంచి బయటకు రాగానే మేళతాళాలతో జ్ఞానేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆమెకు పూలమాలలు వేసి సత్కరించారు. వైవాహిక జీవితంలో సంతోషంగా లేకుంటే విడాకులు తీసుకుని తమ బతుకులు తాము బతకడమే మంచిదని జ్ఞానేంద్ర కుమార్ చెబుతున్నారు. తమకు ఎటువంటి పరిహారం, భరణాలు కూడా అవసరం లేదని ఆయన చెప్పడం విశేషం.







Tags:    

Similar News