ఉత్తరాదిన భారీ వర్షాలు.. 11 మంది మృతి

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పదకొండు మంది ఇరవై నాలుగు గంటల్లో మరణించారు

Update: 2025-08-24 04:33 GMT

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అనేక చోట్ల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే గత ఇరవై నాలుగు గంటల్లో పదకొండు మంది మరణించారు. ఝార్ఖండ్ లో ఐదుగురు మరణించారు. ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ జరగడంతో ఇళ్లు కూలి మహిళ మృతి చెందింది. ఉత్తర భారత దేశంలో అనేక ప్రాంతాల్లో మెరుపు వర్షాలు పడుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

గల్లంతయిన వారు...
అనేక ప్రాంతాల్లో ప్రజలు గల్లంతయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని రియాసీ, కరువా జిల్లాల్లోనూ, ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోనూ, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. రాజస్థాన్ లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, రైలు మార్గాల్లో కూడా అంతరాయం ఏర్పడుతుంది.


Tags:    

Similar News