జమ్మూ కాశ్మీర్ లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందారు

Update: 2025-08-27 02:09 GMT

జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో పాటు వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పథ్నాలుగు మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

వైష్ణోదేవ ఆలయానికి రాకపోకలు బంద్
గాయపడిన పథ్నాలుగు మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించి వరదల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యా యి. గుప్త్ గంగా టెంపుల్ వరదలో సగం వరకు మునిగిపోయిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News