Mumbai : ముంబయికి హై అలెర్ట్.. తమిళనాడులోనూ భారీ వర్షాలు
తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబయిలో హై అలెర్ట్ ను ప్రకటించారు
Mumbai
తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. నీలగిరి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. పలుచోట్ల ఇళ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో బాలుడు సహా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీలగిరి జిల్లాలో రాకపోకలను బంద్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విమాన రాకపోకలకు అంతరాయం...
మరొకవైపు ముంబయిలో కూడా భారీ వర్షం కురుస్తుంది. ముంబయిలో మరో మూడు గంటల్లో అతి భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబయిలో ఇళ్లలో నుంచి బయటకు ఎవరూ రావద్దని తెలిపింది. మరోవైపు ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. బలమై ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలపడంతో ముంబయి లో హై అలెర్ట్ ను వాతావరణ శాఖ హెచ్చరించింది.