Breaking : కర్రెగుట్ట ఆపరేషన్ కగార్ కు బ్రేక్

ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఆపరేషన్ కు ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది.

Update: 2025-05-10 05:09 GMT

ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఆపరేషన్ కు ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది. కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ను నిలిపేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. బలగాలన్నీ కర్రెగుట్టను వదలి సరిహద్దు ప్రాంతాలకు తరలి రావాలని కేంద్ర హోంశాఖ ఆదేశించడంతో ఆపరేషన్ కగార్ కు బ్రేక్ ఇచ్చిన భద్రతాదళాలు తిరుగు ముఖంపట్టాయి.

ఉద్రిక్తతల నేపథ్యంలో...
భారత్ - పాక్ ల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దానికి బ్రేక్ ఇచ్చి తమకు కేటాయించిన చోట రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.


Tags:    

Similar News