Google layoffs : భారత్ లో 450 మంది ఉద్యోగులకు గూగుల్ గుడ్ బై

భారత్ లో ఉన్న గూగుల్ కార్యాలయాల నుంచి సుమారు 450 మందిని తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్

Update: 2023-02-17 06:57 GMT

450 google employees

ట్విట్టర్ తో మొదలైన ఉద్యోగుల లే ఆఫ్ లు.. క్రమంగా కొనసాగుతున్నాయి. పొరుగు దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆయా సంస్థలకు నష్టాలు కలగలిపి.. లాభాలు తక్కువగా ఉన్న దేశాల్లోని ఉద్యోగులను సాఫ్ట్ వేర్, ఐటీ దిగ్గజాలు తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు టెర్మినేషన్ లేఖలను అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గతంలోనే తెలిపింది. ఈ క్రమంలో తొలిదశ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా భారత్ లోని పలువురు గూగుల్ ఉద్యోగులు ఉద్వాసన లేఖలను అందుకున్నారు.

భారత్ లో ఉన్న గూగుల్ కార్యాలయాల నుంచి సుమారు 450 మందిని తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ లలో ఉన్న కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై లేఆఫ్ ప్రభావం పడింది. గూగుల్ నుంచి బయటకు వచ్చేశామంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. "గూగుల్ ఇండియా ఇటీవలి తొలగింపుల్లో ఎంతో నైపుణ్యాలు, ప్రతిభ ఉన్న సహోద్యోగులు కొందరు ప్రభావితమైనట్టు ఈ రోజు ఉదయమే సమాచారం అందింది" అంటూ గూగుల్ ఇండియా ఉద్యోగి రజనీష్ కుమార్ షేర్ చేశారు. గూగుల్ ఇండియా నిన్న తొలగించిన వారిలో తాను కూడా ఉన్నానని అకౌంట్ మేనేజర్ కమల్ దవే కూడా తెలిపారు. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ఉద్యోగులను అధికంగా పనుల్లోకి తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే ఇప్పుడు కొందరిని తొలగిస్తున్నట్టు గూగుల్ వివరణ ఇచ్చింది.


Tags:    

Similar News