పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం

పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది

Update: 2026-03-25 04:28 GMT

పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన అన్ని పార్టీలతో కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్ పై ఏ రకంగా పడనుందన్న దానిపై చర్చించనున్నారు.

వాస్తవ పరిస్థితులను వివరించి...
అఖిలపక్షంలో వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. యుద్ధం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఈ సమావేశంలో వివరించనున్నారు. అలాగే పేద, మధ్య తరగతి ప్రజలకు ఏ రకంగా ఊరట దక్కేలా నిర్ణయాలు తీసుకున్నదీ తెలపనున్నారు. ఈ సమావేశంలో విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ పాల్గొననున్నారు.


Tags:    

Similar News