Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ

నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ జరగనుంది

Update: 2026-03-25 04:17 GMT

నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్‌ భేటీ ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగే ఈ సమావేశంలో రెండు కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలిసింది.

రెండు కీలక అంశాలు...
అలాగే చట్టసభల్లో మహిళలకు 33శాతం కోటా కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. దీంతో పాటు కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News