గ్యాస్, పెట్రోల్ పై ప్రధాని క్లారిటీ

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు

Update: 2026-03-24 12:17 GMT

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో పెట్రోలు, గ్యాస్, డీజిల్ కొరత లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధం దాని ప్రభావంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ లో గ్యాస్, పెట్రోలు కొరత లేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

కావాల్సినంత ఉందని...
కావాల్సినంత గ్యాస్, పెట్రోల్‌ అందుబాటులో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు పనిచేస్తున్నారన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని అన్నారు. ఇది ఆందోళనకరమని, 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కి వచ్చారని, అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.


Tags:    

Similar News