BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందనుంది. నేడు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభం కానున్నాయి
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందనుంది. నేడు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రయివేటు ఫోన్ ఆపరేటర్లకు పోటీగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను నేటి నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యంగా ప్రయివేటు టెలిఫోన్ నెట్ వర్క్ లు వచ్చిన తర్వాత బీఎస్ఎన్ఎల్ వినియోగం తగ్గిపోతుందని భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు ఊతమిచ్చేలా నిర్ణయం తీసుకుంటుంది.
4జీ సేవలను...
బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను 97,500 టవర్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. దీంతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నెట్ వర్క్ విషయంలోనూ, డేటా అంశంలోనూ ఎలాంటి ఇబ్బందులుండవని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా నుంచి ప్రారంభించనున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ లభించినట్లయింది.