గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్

దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 450 రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది.

Update: 2023-05-18 03:44 GMT

బంగారం ఎప్పుడూ ప్రియమే. బంగారాన్ని చూస్తుంటేనే కొనుగోలు చేయాలనిపిస్తుంది మహిళలకు. పడతులకు వస్త్రాలంకరణలో బంగారాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే బంగారం ధరలు ఎక్కువగా అయినా పెద్దగా ఆలోచించరు. బంగారు వస్తువు తన ఇంటికి వస్తే చాలనుకుంటారు. అంతే తప్ప ధరలను కూడా ఆలోచించని మనస్తత్వం మహిళలది. అందుకే భారతదేశంలోనూ అందులో దక్షిణాదిన బంగారానికి అంత డిమాండ్ ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో మదుపు చేయాలంటే గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. బంగారు ఆభరణాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. గోల్డ్ బిస్కట్లు, బంగారం ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తుంటారు. అత్యవసర సమయాల్లో, కష్ట కాలంలో బంగారం ఉపయోగపడుతుందన్న నమ్మకంతోనే బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

తగ్గిన వెండి....
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 450 రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర పై ఐదు వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,300 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,420 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 78,200 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News