నేడు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

దేశ వ్యాప్తంగా నేడు గిగ్ వర్కర్ల సమ్మెచేయనున్నారు.

Update: 2025-12-31 01:55 GMT

దేశ వ్యాప్తంగా నేడు గిగ్ వర్కర్ల సమ్మెచేయనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్డులకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. వీరి సమ్మెతో న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం చూపనుంది. ప్రధానంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సమ్మెకు దిగడంతో భారీగా వ్యాపారం దెబ్బతినే అవకాశాలున్నాయి. అలాగే రిటైలర్లపై కూడా ఈ ఏడాది చివరి రోజు ప్రభావం చేయనుంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి దేశ వ్యాప్తంగా అన్ని రకాల వస్తువుల అత్యధికంగా వీటి ద్వారానే అమ్ముడు కానున్నాయి.

తమ డిమాండ్ల సాధనకు...
అదను చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మెబాట పట్టారు. ఈరోజు సమ్మె కొనసాగితే వ్యాపార రంగంపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఫుడ్ డెలివరీలు నిలిచిపోవడంతో హోటల్ పరిశ్రమ దేశ వ్యాప్తంగా దెబ్బతినే అవకాశాలున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో అమ్మకాలు నిలిచపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతంది. ఆదాయం క్రమంగా తగ్గిపోవడం, ఉద్యోగ గౌరవంతో పాటు తమకు భద్రత కొరవడిందని గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. మరి చర్చలు ఫలించి వీరు విరమిస్తే సాయంత్రానికి అమ్మకాలు ఊపందుకుంటాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి.


Tags:    

Similar News