Union Cabinet : ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది

Update: 2026-03-10 06:13 GMT

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగనున్న కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధాని అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్ పై ఎంత మేరకు పడుతుందన్న దానిపై చర్చించనున్నారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గురించి చర్చించనున్నారు.

యుద్ధం ప్రభావంతో...
పెట్రోలకు సంబంధించి పెద్దగా ఇబ్బందులు లేవు. పెట్రోలు నిల్వలు మరో నలభై రోజులకు సరిపడా ఉన్నాయి. ఎల్.పి.జి గ్యాస్ కొరత రానున్న కాలంలో ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలను జారీ చేసింది. వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ప్రధాన అంశాలపై నేడు కేంద్ర కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News