బెంగళూరు వెళ్లే వారికి నేడు అలెర్ట్
ఈరోజు బెంగళూరులో హోటళ్లు బంద్ ను పాటిస్తున్నారు
బెంగళూరు వెళ్లే వారికి నేడు అలెర్ట్. ఈరోజు బెంగళూరులో హోటళ్లు బంద్ ను పాటిస్తున్నారు. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచి బెంగళూరు మహానగరంలో హోటళ్లన్నీ మూత పడ్డాయి. దీంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు.
నేడు హోటళ్లు బంద్...
కేంద్ర ప్రభుత్వం ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హోటళ్లకు వాణిజ్యగ్యాస్ సిలిండర్ల నిలిపివేతపై నిరసన వ్యక్తం చేస్తూ నేడు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ బంద్ కు పిలుపు నిచ్చింది. దీంతో బెంగళూరు నగరంలోని హోటళ్లన్నీ మూతపడ్డాయి.