Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినే ఈ సమా8.8 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8.7 లక్షల కోట్లతో జల్ జీవన్ మిషన్ పొడిగింపుకి కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది. 2905 కోట్లతో సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్ 4 లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
నాలుగు లేన్ల రహదారికి...
1,569 కోట్లతో సైంథియా-పాకూర్ మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం చెప్పింది. 3,839 కోట్లతో బద్నావర్-థాండియా - తిమర్వాని 5 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం కూడా చెప్పింది. 3631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.