Gas Cylinder : గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయ్
నేటి నుంచి గ్యాస్ సిలిండర్లు ధరలు తగ్గాయి. సిలిండర్ ధరపై 33.50 రూపాయలు తగ్గింది.
నేటి నుంచి గ్యాస్ సిలిండర్లు ధరలు తగ్గాయి. సిలిండర్ ధరపై 33.50 రూపాయలు తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల ధరలపై సమీక్షను నిర్వహిస్తాయి. ఈరోజు నవంబరు 1వ తేదీ కావడంతో సమీక్ష నిర్వహించాయి. పెట్రోలు ధరలు యధాతధంగా ఉండగా, గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
తగ్గిన ధరలు...
అయితే తగ్గించిన ధరలు కేవలం వాణిజ్య సిలిండర్లకు మాత్రమే వర్తిస్తాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధపై 33.50 రూపాయలు తగ్గింది. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. దీంతో వాణిజ్య సిలిండర్ ధ ధర ఢిల్లీలో 1,531.50 రూపాయలకు చేరింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ 14.2 కేజీల ధర యధాతధంగ ఉందని, హైదరాబాద్ లో దీని ధర 905 రూపాయలుగా ఉందని తెలిపింది.