నేడు విజయరూపానీ అంత్యక్రియలు

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయరూపానీ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

Update: 2025-06-16 03:31 GMT

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయరూపానీ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. రాజ్ కోట్ లో ఆయన పార్ధీవ దేహానికి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేడు సంతాపదినాలను పాటించాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంతాపదినంగా...
ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను చేపట్టరు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించడంతో ఆయన పార్ధీవ దేహాన్ని గుర్తించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Tags:    

Similar News