మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు జీవిత ఖైదు

హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు జీవిత ఖైదు విధించింది

Update: 2025-08-03 03:13 GMT

హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు జీవిత ఖైదు విధించింది. అత్యాచారం కేసులో ప్రజ్వల్ గత పథ్నాలుగు నెలల నుంచి జైలులో ఉన్నారు. అయితే అత్యాచారం కేసులో విచారించిన న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే అత్యాచారం కేసులో జీవితాంతం జైలులో ఉండాలని, 11.35 లక్షల జరిమానా విధించారు. అందులో పదకొండు లక్షల రూపాయలు బాధితురాలికి చెల్లించాలన్నారు.

అత్యాచారం కేసులో...
ప్రజ్వల్ పై నాలుగు అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు చెప్పిన తీర్పు మొదటి కేసులోది. అయితే ప్రజ్వల్ రేవణ్ణ మాత్రం తనపై రాజకీయ కుట్ర జరిగిందని, అందులో భాగంగానే కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయినా న్యాయమూర్తి మాత్రం జీవితాంతం జరిమానా విధించాలని నిర్ణయించారు. కఠిన శిక్ష వేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు కోరారు.


Tags:    

Similar News