కేజ్రీవాల్ ఓటమి.. ఆప్ అగ్రనేతలందరూ అదే బాట
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కేజ్రీవాల్ మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉదయం నుంచి కేజ్రీవాల్ ప్రతి రౌండ్ లో వెనకబడి ఉన్న కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అలాడే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు.
ఓటమికి కారణం...
ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశి కూడా వెనకంజలో ఉన్నారు. ఆప్ అగ్రనేతలందరూ ఓటమి పాలు కావడం వెనక అవినీతి అని చెప్పకతప్పదు. అన్నాహజారే సయితం ప్రభుత్వ విధానాలతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ దొరికిపోవడం వంటి అంశాలు ఆ పార్టీ ఓటమికి కారణమని చెప్పారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని చేపట్టబోతుంది.