లీడ్ లోకి వచ్చిన కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలోకి వచ్చారు

Update: 2025-02-08 04:31 GMT

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలోకి వచ్చారు. ఆమ్ ఆద్మీపార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ఇద్దరూ ఆధిక్యంలోకి వచ్చారు. తొలి రౌండ్ లో వెనుకంజలో ఉన్న ఈ ఇద్దరు నేతలు తర్వాత రౌండ్ లో ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో కొంత ఆమ్ ఆద్మీపార్టీ నేతల్లో ఊరట దక్కినట్లయింది.

తగ్గుతున్న సీట్లు...
మొదటి, రెండు రౌండ్ లలో ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ మూడు, నాలుగో రౌండ్ వచ్చేసరికి కొంత తగ్గుతోంది. ప్రస్తుతం నలభై ఆరు స్థానాల్లోనే బీజేపీ ముందంజలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ క 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ ఓటు షేర్ కూడా క్రమంగా తగ్గుతుండటం విశేషం. యాభై నుంచి నలభై ఎనిమిది శాతానికి ఓట్ల శాతం పడిపోయింది.


Tags:    

Similar News