India : వందలాది సర్వీసులు రద్దు.. ప్రయాణికుల ఇబ్బంది

దేశంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Update: 2025-12-04 02:07 GMT

దేశంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానసేవలకు తీవ్ర అంతరాయం కలగడంతో వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందులో ఇండిగో సంస్థకు చెందిన వందకు పైగా విమానాల సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శంషాబాద్ లోనే...
శంషాబాద్ లోనే వందకు పైగా సర్వీసులు రద్దు కావడంతో చెన్నై, బెంగళూరు, తిరుపతి, విశాఖ, ఢిల్లీ ఇలా అనేక నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైళ్లను, బస్సులను ఆశ్రయించాల్సివచ్చింది. ఈరోజు కూడా మరో 36 విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. పైలట్ల డ్యూటీ విషయంలో డీజీసీఏ విధించిన నిబంధనలతో పాటు రాత్రి విమానాల ల్యాండింగ్ ను తగ్గించడం కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు. శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. వారికి సర్ది చెప్పేందుకు ఇండిగో సిబ్బంది తంటాలు పడాల్సి వచ్చింది.


Tags:    

Similar News