అస్సాంలో తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్
అస్సాంలో తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయి చరిత్రలో నిలిచిపోయింది
అస్సాంలో తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయి చరిత్రలో నిలిచిపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పాటైన తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ సి - 130 తొలి సారి ఇక్కడ ల్యాండ్ అయింది. ఈ ఫెసిలిటీ చైనా సరిహద్దుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది.
అత్యవసర సమయంలో...
అత్యవసర సమయంలో యుద్ధ విమానాలను, ఫైటర్లను ల్యాండ్ చేసేందుకు దీనిని నిర్మించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఈశాన్య రాష్ట్రంలో తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఈరోజు అస్సాంలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 5,350 కోట్ల పనులను ఆయన ప్రారంభించనున్నారు.