Narendra Modi : నేడు అసోంలో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అసోం రాష్ట్రంలో పర్యటించనున్నారు

Update: 2026-02-14 02:36 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అసోం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని తొలి ఈఎల్ఎఫ్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. దీంతో పాటు అసోంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవాలు ప్రధాని నరంద్ర మోదీ చేయనున్నారు. గౌహతిలో దాదాపు 5,450 కోట్ల రూపాయల వ్యయం గల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు.

అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభం
అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. జాతికి అంకితం చేయనున్నారు. అలాగే జాతీయ డేటా సెంటర్ ను కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన కొనసాగనుంది.


Tags:    

Similar News