నేడు భారత్ బంద్

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి

Update: 2026-02-12 02:53 GMT

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి. కార్మక సంఘాలు, రైతు సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. కార్మిక సంస్కరణలను తీసుకు వచ్చి వారికి రక్షణ లేకుండా చేస్తుందని ఆరోపిస్తూ ఈ బంద్ కు ట్రేడ్ యూనియన్స్ పిలుపు నిచ్చాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.

కాంగ్రెస్ మద్దతుతో...
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలు పాల్గొనాలని కోరాయి. కార్మికులకు ఉద్యోగ భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంద్ చేయనున్నట్లు కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News