నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి

Update: 2026-02-13 03:50 GMT

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తిరిగి మార్చి 9వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ పై చర్చలతో సాగింది. అయితే ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.

మార్చి 9వ తేదీ నుంచి...
మలి విడత సమావేశాలు మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ రెండో తేదీ వరకూ మలి విడత పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. మొత్తం పదిహేడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మలి విడత సమావేశంలో స్పీకర్ పై అవిశ్వాసం చర్చ, ఓటింగ్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన పద్దులు, కీలక బిల్లులపై చర్చ జరగనుంది.


Tags:    

Similar News