కోల్ కతాలో ఫ్యాన్స్ ఆగ్రహం

కోల్‌కతా లోని సాల్ట్‌లేక్‌ స్టేడియంలో అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-12-13 08:09 GMT

కోల్‌కతా లోని సాల్ట్‌లేక్‌ స్టేడియంలో అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు.మైదానంలోకి కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు అభిమానులు విసిరేశారు. మెస్సీని చూసేందుకు స్టేడియానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఎక్కువ సేపు ఉండకపోవడమే అభిమానుల ఆగ్రహానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

అభిమానులను అదుపు చేయడానికి...
అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. కోల్ కత్తా ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మెస్సీ, ఫ్యాన్స్ కు మమత బెనర్జీ క్షమాపణలు చెప్పారు. స్టేడియంలో కుర్చీలను ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలను కూడా చించివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Tags:    

Similar News