ప్రభుత్వానికే భారీ షాక్.. హైవేపై నకలీ టోల్ ప్లాజా.. రూ.80 కోట్ల వసూలు
ప్రభుత్వాన్ని మోసం చేసిన కేటుగాళ్లు.. హైవేపై ఏడాదిన్నర పాటు నకిలీ టోల్ ప్లాజా సాధారణంగా కొందరు..
సాధారణంగా కొందరు మోసాలకు పాల్పడం చూసే ఉంటారు.. నకిలీ దందాలు ఏర్పాటు చేయడం, ఫేక్ ఫైనాన్స్‌లు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు కొల్లగొట్టే వారిని చూశాం. ఇక్కడ మాత్రం కొందరు ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేశారు. వీరు చేసిన నమోసాన్ని చూస్తే దిమ్మదిరిగేపోయోలా ఉంటుంది. ఈ వ్యవహారాన్ని చూస్తే ప్రతి ఒక్కరు షాక్ కావాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ఎవ్వరు నమ్మని విధమైన ఘటన గుజరాత్ లోవెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, రాష్ట్రంలోని మోర్బి ప్రాంతానికి సమీపంలో కొందరు ఒకటన్నర సంవత్సరాలుగా నకిలీ టోల్ బూత్ నడిపిస్తున్నారు. ఏడాదిన్నరగా నకిలీ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తీరు ఇప్పటికి ఎవ్వరికి తెలియకపోవడం గమనార్హం.
ఇప్పటి వరకు రూ.8౦ కోట్లు వసూలు
గుజరాత్‌లోని బమన్‌బోర్-కచ్ జాతీయ రహదారిపై, కొంతమంది శక్తివంతమైన వ్యక్తులు హైవేని దాటవేసి, ప్రైవేట్ స్థలంలో నకిలీ టోల్ ప్లాజాను నిర్మించారు. ఈ వ్యక్తులు ఒకట్రెండు-నాలుగు నెలలే కాదు 1.5 ఏళ్లపాటు ప్రభుత్వ అధికారుల కళ్లు గప్పి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. నకిలీ టోల్ ప్లాజా ప్రజలు తమ బూత్ గుండా వెళ్లే వ్యక్తుల నుంచి సగం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. నకిలీ టోల్ ప్లాజాల ద్వారా ఏడాదిన్నరగా సామాన్య ప్రజలనే కాకుండా పోలీసులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం మోసం చేశారు. ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
జాతీయ రహదారికి సంబంధించిన అధీకృత టోల్ అయిన వాఘాసియా టోల్ ప్లాజా మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు భూముల యజమానులు ఈ విధంగా ఏడాదిన్నరగా బహిరంగంగానే వేల రూపాయలు వసూలు చేశారు.నివేదిక ప్రకారం, నిందితులు ట్రాఫిక్‌ను హైవే కుడి మార్గం నుండి మళ్లించేవారు. వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ భూమిలో నిర్మించిన వారి టోల్ ప్లాజా వైపు మళ్లించేవారు.
టోల్ ట్యాక్స్‌లో రాయితీ
అంతేకాకుండా ఈ వ్యక్తులు చాలా తెలివిగా టోల్ పన్నును వసూలు చేశారు. వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ సగానికి తగ్గించారు. ఏడాదికి పైగా ఇదంతా కొనసాగినా ఈ అక్రమ దోపిడీని ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వాహనాలకు అసలు టోల్ ట్యాక్స్ రూ.110 నుంచి రూ.595 ఉండగా, నిందితులు కార్ల యజమానులు, భారీ ట్రక్కు డ్రైవర్ల నుంచి రూ.20 నుంచి రూ.200 వరకు వసూలు చేసేవారు.
ఈ కేసులో వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ యజమాని అమర్షి పటేల్, వనరాజ్ సింగ్ ఝాలా, హర్విజయ్ సింగ్ ఝాలా, ధర్మేంద్ర సింగ్ ఝాలా, యువరాజ్ సింగ్ ఝాలా గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఇప్పుడు ఫిర్యాదు నమోదు చేశారు.