Delhi : ఎన్నికల వేళ కేజ్రీవాల్ పై కేసు నమోదు
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదయింది.
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదయింది. హర్యానా పోలీసులు కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు. యమునా జలాల్లో విషం కలుపుతుందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఆయనపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కావాలని, ఢిల్లీ ఓటర్లను మభ్యపర్చేలా, భయపెట్టేలా వ్యవహరించారంటూ ఈ పోలీసు కేసు ను హర్యానా పోలీసులు నమోదు చేశారు.
ప్రజలను రెచ్చగొట్టేలా...
ప్రజలను రెచ్చగొట్టడంలో భాగంగానే కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలు చేశారని, అలర్లను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, హాని కలిగించే ఉద్దేశ్యంతో మరొకరిపై తప్పుడు నేరం మోపడం వంటి సెక్షన్ల కింద కేజ్రీవాల్ పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఇటీవల హర్యానా కోర్టు కూడా నోటీసులు జారీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.