Gold Prices : పెరగలేదని సంతోషించాలా? కొనలేమని బాధపడాలా?

బంగారం ధరలు పెరగకపోయినా బాధ తప్పదు. ఎందుకంటే ఇప్పటికే పసిడి ధరలు కొనుగోలు చేయలేని పరిస్థితికి చేరుకున్నాయి

Update: 2023-12-11 03:12 GMT

Gold prices

బంగారం ధరలు పెరగకపోయినా బాధ తప్పదు. ఎందుకంటే ఇప్పటికే పసిడి ధరలు కొనుగోలు చేయలేని పరిస్థితికి చేరుకున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు పసిడి ఎప్పడో దూరం అయిపోయింది. ఇప్పుడు ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా బంగారం కొనుగోలు చేయాలంటే భయపడిపోతున్నారు. ఇంత ధర పెట్టి పసిడిని కొనుగోలు చేయడం అవసరమా? అన్న డైలమాలో అనేక మంది పడిపోయారు. బంగారంపై వెచ్చించే సొమ్ము మరోచోట పెడితే లాభానికి లాభం... చేకూరుతుందన్న ఆశ జనంలో క్రమంగా కలుగుతుంది.

కొనుగోళ్లు తగ్గి...
అందుకే బంగారం కొనుగోళ్లు ఇటీవల కాలంలో మందగించాయని చెప్పాలి. బంగారం ధరలకు పెరగడమే తెలుసు కానీ.. తగ్గడం ఏమాత్రం తెలియదు. అలాగని వాటిని కొనుగోలు చేసి కాపాడుకోవడం కూడా కష్టంగా మారిపోయింది ఈ రోజుల్లో. బంగారం తమ శక్తికి మించి కొనుగోలు చేసేవారొకప్పుడు. ఇప్పుడు శక్తి ఉన్నా కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. అంత విలువైన వస్తువుగా మారిపోయింది. స్టేటస్ సింబల్ గా కనపడుతున్నా దానికి ప్రత్యామ్నాయం కనిపిస్తుండటంతో బంగారం జోలికి ఎవరూ పెద్దగా వెళ్లడం లేదని వ్యాపారులే చెబుతున్నారు.
స్థిరంగానే...
గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాస్త ఊరట కలిగించాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేసే వారే దుకాణాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57, 150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,350 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 78,000 రూాపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News