ఏపీ, తెలంగాణలోనూ ఈడీ సోదాలు

దేశ వ్యాప్తంగా పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2025-11-27 07:46 GMT

దేశ వ్యాప్తంగా పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించి ఈ సోదాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్వహిస్తున్నారని తెలిసింది. పది రాష్ట్రాల్లో మొత్తం పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఆరు చోట్ల సోదాలు...
తెలుగు రాష్ట్రాల్లో ఆరుచోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ ప్రాంతాల్లో ఈసోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మెడికల్ కళాశాలల అనుమతుల్లో జరిగిన అవకతవకలపై ఈ విచారణ జరుగుతుందని తెలిసింది.


Tags:    

Similar News