ముఖ్యమంత్రి మేనల్లుడు అరెస్ట్
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడుపై ఈడీ కేసు నమోదు చేసింది
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడుపై ఈడీ కేసు నమోదు చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఆయనను అరెస్ట్ చేసింది. 2018లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన కేసును ఈడీ బయటకు తీసింది. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన తర్వాత అతనిని అరెస్ట్ చేసింది.
పద కోట్ల నగదును...
ఈ కేసులో ఇప్పటికే పది కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. పంజాబ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మేనల్లుడు భూపేందర్ సింగ్ పై ఈడీ కేసు నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈడీ కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తును మరింత లోతుగా చేపట్టింది.