Anil Ambani : అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లోన్‌ఫ్రాడ్ కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అనిల్ అంబానీ పదిహేడు వేల కోట్ల మేర రుణాలను తీసుకుని మోసం చేశారన్న అభియోగంపై ఆయనపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 5వ తేదీన...
ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని కోరారు. మనీలాండ్ రింగ్ చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్ మెంట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రికార్డు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.