జార్ఖండ్‌, ఢిల్లీ లో ఈడీ దాడులు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల జార్ఖండ్, ఢిల్లీలో సోదాలు చేస్తున్నారు.

Update: 2025-09-23 07:41 GMT

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల జార్ఖండ్, ఢిల్లీలో సోదాలు చేస్తున్నారు. భూమి కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ మంగళవారం జార్ఖండ్‌, ఢిల్లీలో దాడులు చేపట్టింది. బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

తొమ్మిది ప్రదేశాల్లో...
రాంచీలో ఆరు ప్రదేశాలు, ఢిల్లీలో మూడు ప్రదేశాలపై అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధాన నిందితుడు కమలేష్‌కుమార్‌ సన్నిహితుడు బి.కె.సింగ్‌ సహా పలువురికి చెందిన ప్రాంగణాలపై ఈ చర్యలు జరిగాయని వర్గాలు తెలిపాయి. ఈ కేసు రాంచీ జిల్లాలోని కాంకే బ్లాక్‌ భూముల కుంభకోణానికి సంబంధించినదని, నిందితులు సర్కిల్‌ అధికారులతో కుమ్మక్కై భూమి రికార్డులను నకిలీగా సృష్టించి విక్రయాలు జరిపి అక్రమార్జన చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


Tags:    

Similar News