ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది.

Update: 2023-02-27 02:21 GMT

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయ ఏడు గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకూ పోలింగ్ కొననసాగనుంది. ఇప్పటి వరకూ జోరుగా సాగిన ప్రచారంతో అన్ని పార్టీలు ఈ సారి గెలుపుపై ధీమాతో ఉన్నాయి. మేఘాలయలో 21 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 368 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గలకు ఒకే విడత ఎన్నికలు జరుగుతున్నాయి.

నాగాలాండ్‌లో...
ఇక నాగాలాండ్ లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. భద్రతా దళాలతో పాటు స్థానిక పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాు. మొత్తం 183 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 13.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుోనున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామాతో ఒక సీటు ఇప్పటికే బీజేపీ పరమయింది. మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కౌంటింగ్ మార్చి 2వ తేదీన జరగనుంది.


Tags:    

Similar News