Nepal : నేపాల్ లో భూప్రకంపనలు
నేపాల్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో ఈరోజు తెల్లవారు జామున భూమి కంపించింది
నేపాల్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో ఈరోజు తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత6.1 నమోదయిందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకూ ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై వివరాలు అందలేదు.
భారత్ లోనూ...
నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావం కారణంగా భారత్ లోని పలు ప్రాంతాల్లోనూ దాని ప్రభావం కనిపించింది. బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలపారు. భారత్ లో దాని ప్రభావం తక్కువగానే ఉందని అధికారులు చెప్పారు. నేపాల్ లో తరచూ భూమి కంపిస్తుంటుందని, ఇది సాధారణమైనదేనని అధికారులు చెబుతున్నా రిక్టర్ స్కేల్ పై తీవ్రత దృష్ట్యా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలిసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయి సమాచారం అందనుంది.