నేపాల్‌లో భూకంపం.. ఎఫెక్ట్ ఢిల్లీలో..

ఢిల్లీ-ఎన్‌సిఆర్, యుపీ, బీహార్, ఉత్తరాఖండ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల‌లో బలమైన భూకంపం సంభవించింది

Update: 2023-11-04 02:11 GMT

ఢిల్లీ-ఎన్‌సిఆర్, యుపీ, బీహార్, ఉత్తరాఖండ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల‌లో బలమైన భూకంపం సంభవించింది. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించింది . భూకంప కేంద్రం నేపాల్ లో ఉంద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ తెలిపింది. ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప‌రుగులు తీశారు. చాలా సేపు ప్రకంపనలు వచ్చినట్లు ప్రజలు చెబుతున్నట్లు నివేదిక‌లు తెలిపాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది.

ఇదిలావుంటే.. నేపాల్‌లో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా న‌మోదైంది. భూప్ర‌కంప‌న‌ల ధాటికి ఇప్పటివరకు 70 మంది చనిపోయారు. నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో ఉంది.

Tags:    

Similar News